శ్రీహరికోట: అంతరిక్ష కేంద్రం షార్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది. పాత పరికరాలు ఉన్న 146 భవనంలో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో రాకెట్లకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ప్రమాదంలో ఇనుప తలుపులు దగ్ధమైయ్యాయి. అగ్నిప్రమాదంలో భవనం పాక్షికంగా దెబ్బతింది. 2004 నుంచి పాత సామాన్లు నిల్వ ఉన్న భవనాల్లో తరుచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.