ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:02 PM

చెన్నై: మరుగుజ్జు నటుల్లో పాపులర్‌ అయిన హాస్యనటుడు తవకలై అకాల మరణం చెందారు. స్థానిక వడపళనిలోని మురుగన కోయిల్‌ సమీపంలో నివాసం ఉంటున్న తవకలై ఆదివారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఆయన వయస్సు 42 సంవత్సరాలు. 1983లో భాగ్యరాజ్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ముందానై ముడిచ్చు' చిత్రం ద్వారా తవకలై తమిళ సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. 'ఆనపావం' వంటి పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వంటి అగ్రహీరోలతోను నటించి హస్యనటుడిగా గుర్తింపు పొందారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, సింహళి తదితర ఆరు భాషల్లో దాదాపు 490కిపైగా చిత్రాల్లో తవకలై నటించారు. కొంతకాలంగా సినీ అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై నటనను కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నడిగర్‌ సంఘం సంతాపం తెలియజేసింది. అంత్యక్రియలు సోమవారం జరుపనున్నట్టు బంధువులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa