హైదరాబాద్: భాగ్యనగరంలో చారిత్రక కట్టడాల వద్ద కబ్జాలను అరికట్టేందుకు, అక్రమ భవనాలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల అధికారులు, అగాఖాన్ ట్రస్ట్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి చారిత్రక, ప్రాచీన కట్టడాన్ని, ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేయాలని, జియో ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రదేశాలు, కట్టడాల వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాలని నిర్ణయించారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులకు యునెస్కో ప్రాచీన హోదా కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని కేటీఆర్ చెప్పారు. విశ్రాంత ఉద్యోగుల సేవలకు కూడా ఉపయోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa