ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి గీతారెడ్డి తీవ్ర విమర్శలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 05:42 PM

సంగారెడ్డి: టీఆర్ఎస్ వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైంది కానీ, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పబ్లిసిటీకి రూ.30 కోట్లు ఖర్చుచేశారు కానీ, ఇళ్ల నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సంగతి చూస్తామన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పాలన ఇలా ఉంటే.. కేంద్రంలో మరీ దారుణంగా ఉందన్నారు. ఎన్నికల ముందు విదేశాల్లో నల్లధనాన్ని ప్రజలకు పంచుతామన్న మోదీ హామీ ఏమైంది? అని గీతారెడ్డి ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa