ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన డాన్స్ చేయడానిి సరైన జోడి కోసం వేట మొదలెట్టారట చిత్ర యూనిట్. నటనతోపాటు డాన్యులను వేయడంలో దిట్ట జూనియర్ ఎన్టీఆర్. తనదైన శైలిలో జూనియర్ చేసే నృత్యాలు అభిమానులకు జోష్ కలిగిస్తాయి. ఇటీవల వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్‌తో ఎన్టీఆర్ చేసిన ఐటెం పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జై లవకుశలో ఓ ప్రత్యేకమైన పాటను పెట్టడానికి రెడీ అవుతున్నారట యూనిట్. సో.. ఈ సాంగ్‌తో మరోసారి ెజూనియర్ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ మాంచి మాస్‌తో కూడిన పాటను రికార్డు చేశాడట. ప్రస్తుతం ఆ పాటలో హాట్ హాట్ హీరోయిన్‌తో డ్యాన్స్ చేయించాలనే ఆలోచనకు వచ్చారట. దాంతో జూనియర్ పక్కన ఏ హాట్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచేలో ఉన్నారట. తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకర్షించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.