రకుల్‌కి పవన్‌తో చేయాలని ఉందట..!

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 01:18 AM
 

ఇటీవల నాగచైతన్యతో రారండోయ్‌ వేడుక చూద్దాంతో మంచి హిట్‌ కొట్టి జోరు మీదుంది అందాల భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ చిత్రంలో రకుల్‌ పోషించిన భ్రమరాంబ పాత్రకు ప్రశంసలు లభించాయి. అలాగే బోయపాటి సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాలో కూడా జానకిగా సరికొత్త పాత్రను పోషిస్తుంది. టాలీవుడ్‌లో యువ హీరోలతోపాటు, టాప్‌ హీరోలతో కూడా నటించే ఛాన్స్‌ కొట్టేసింది ఈ గ్లామర్‌ బొమ్మ. ప్రస్తుతం మహేశ్‌ బాబుతో స్పైడర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీకి మనసలో ఓ తీరని తీరని కోరిక ఉందట. పవన్‌ కల్యాణ్‌తో నటించాలని ఎప్పటినుంచో మనసులో ఉందట. రకుల్‌ పవర్‌ స్టార్‌ పవన్‌తో ఇప్పటివరకు నటించలేదు. పవన్‌తో నటించే అవకాశం కోసం రకుల్‌ ఎదురుచూస్తున్నట్టు ఇటీవల రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన కోరికని బయట పెట్టింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాలో పవన్‌ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత మహా అంటే మరో సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఆ తర్వాత రాజకీయాలకు పరిమితం కానున్నాడనే వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మధ్యలో పవన్‌ కళ్యాణ్‌తో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకోబోనని రకుల్‌ చెప్పినట్టు తెలుస్తుంది.