పవన్‌కల్యాణ్ నటించిన 'కాటమరాయుడు' ప్రమోషన్ వెరైటీ సాగుతోంది. ఇప్పటికే రకరకాల పిక్స్ బయటకువచ్చాయి. రీసెంట్‌గా టీజర్ విడుదల కావడంతో ఈ ఫిల్మ్‌పై అంచనాలు పెరిగిపోవడం, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరుగుతున్నట్లు టాక్. ఇదేక్రమంలో కాటమరాయుడికి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. లొకేషన్ ఎక్కడ అనేది పక్కనబెడితే.. కాటమరాయుడు, ఆయన బ్రదర్స్‌పై కీలకమైన సీన్స్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్. అదే సమయంలో పవన్ హార్డ్‌కోర్ అభిమాని హీరో నితిన్ సెట్స్‌కి రావడంతో రాయుడు, ఆయన బ్రదర్స్ ఇలా దర్శనమిచ్చారు. నార్మల్‌గా లుంగీతో కనిపించే పవన్, పంచెకట్టుతో వెరైటీ వున్నాడంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa