ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైనల్స్‌లో కోహ్లిది చెత్త రికార్డే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 01:35 AM

లండన్‌ : టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్‌ కోహ్లీ జట్టులో డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా కూడా పేరు గాంచాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికు క్రికెట్‌లో ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు... అనేక మ్యాచ్‌ల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చిన కోహ్లీ అందరి మన్ననలు పొందాడు అటు జట్టు ప్రతిష్టను, ఇటు దేశ ప్రతిష్ఠను కూడా పెంచాడు. ఇన్ని విధాల అందరితో కొనియాడబడుతున్న కోహ్లికి ఓ చెరగని మచ్చ కూడా ఉంది. అదే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌ల్లో అవసరానికి తగ్గట్టు రాణించకపోవడం. విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్‌ మ్యాచ్‌లాడాడు. కానీ ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ కోహ్లి బ్యాటింగ్‌ సగటు 22 మాత్రమే. తాజాగా ఆదివారం నాడు జరిగిన అత్యంత కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. పాకిస్తాన్‌ యువ బౌలర్‌ ఆమిర్‌ వ్యూహానికి తలొగ్గాడు. మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి... లైఫ్‌ పొందిన కోహ్లీ దానిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తామేమీ ఆశించలేమని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్‌ చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com