రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న హోంమంత్రి నాయిని

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:42 PM
 

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. మొయినాబాద్ లోని చిలుకూరు రెవెన్యూలో గల ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయ‌న ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి మహేందర్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీస్ స్టేష‌న్‌ల‌ను, పోలీస్ శాఖ‌కు సంబంధించిన భ‌వ‌నాల‌ను విడ‌త‌ల వారిగా ఆధునీక‌రిస్తామ‌ని తెలిపారు. ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ పోలీస్ సోద‌రుల‌లో సైపుణ్యం పెంచుతుంద‌ని వెల్ల‌డించారు.