కేంద్రమంత్రి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 03:29 PM
 

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని వెంకయ్యకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధి, రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే.