రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం మద్దతు ప్రకటించిన కేసీఆర్

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 03:54 PM
 

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవిద్‌ను ఎంపిక చేసినట్లు కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్‌ను ఎంపిక చేసినట్లు మోదీ ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రామ్ నాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, దేశానికి ఉపయోగపడేలా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థించిందని ఓ న్యూస్ ఛానెల్ తో కేటీఆర్ అన్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి గా అట్టడుగు వర్గానికి చెందిన మంచి విద్యా వంతుడిని ఎంపిక చేయడం హర్షణీయమని అన్నారు.