రామ్‌నాథ్ కోవింద్‌కే మా మ‌ద్ద‌తు : క‌విత‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 06:31 PM
 

న్యూఢిల్లీ: రామ్‌నాథ్ కోవింద్‌కే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని టీఆర్ఎస్ ఎంపీ క‌విత్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీకి తెలియ‌జేశార‌ని క‌విత గుర్తు చేశారు. ఇవాళే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎన్డీఏ కూట‌మి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ఈ మ‌ధ్యాహ్నాం వెల్ల‌డించారు. ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాని సీఎం కేసీఆర్‌ను కోరార‌ని, అయితే ఆ విష‌యాన్ని పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఎంపీ క‌విత తెలిపారు.