ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చర్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 06:49 PM

వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ, పర్యావరణ, బీసీ అభివృద్ధి శాఖల మంత్రి జోగు రామన్న చెప్పారు. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో వన్యప్రాణుల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. వన్యప్రాణులను వేటాడే వారి భరతం పడతామని, వేటగాళ్లపై నిరంతరం నిఘా ఉంచుతామని మంత్రి రామన్న హెచ్చరించారు. కవ్వాల్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో సాయుధ బలగాలతో నిఘా పటిష్టం చేస్తామన్నారు. రానున్న వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అడవుల్లో ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పనులకు వన్యప్రాణుల బోర్డ్ సమావేశంలో క్లియరెన్స్ ఇచ్చినట్టు కేంద్ర బోర్డుకు నివేదించాలని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో బోర్డ్ సభ్యులైన ఎమ్మెల్యేలు బాపూరావు రాథోడ్, గువ్వల బాలరాజు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీన, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, వైల్డ్ లైఫ్ హెడ్ మనోరంజన్ భాంజా, బోర్డ్ సభ్యుడు జనార్దన్ రాథోడ్, అదనపు డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa