ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలకతాలో భారీ అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:16 PM

కోల్‌కతా: పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతా నగరంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌ బుర్రా బజార్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శతాబ్దం పూర్వం నాటి భవనంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దాదాపు 35 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. గత రాత్రి మంటలు చెలరేగి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.


భవనంలో చాలా భాగం ధ్వంసం కావగంతో పూర్తిగా కూలిపోతుందేమోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. భవనం చుట్టుపక్క ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రాష్ట్ర మంత్రి, నగర మేయర్‌ రాత్రంతా ఘటనాస్థలం దగ్గరే ఉండి సహాయకచర్యలు పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే భవనంలో మండే పదార్థాలు నిల్వ ఉండడం వల్ల అవి అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా బుర్రా బజార్‌లోని బాగ్రి మార్కెట్‌ను ఈరోజు మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa