వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు జోడిస్తూ వస్తోంది వాట్సాప్. ఇక ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆ ఫీచర్ కూడా ఇప్పుడు వచ్చేసింది. అదే రీకాల్, రీవోక్. త్వరలోనే వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొన్ని విండోస్ ఫోన్లలో ఇది కనిపిస్తోంది. ఆ ఫోన్లలో బీటా వెర్షన్ వాడుతున్న వారికి సౌలభ్యం ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకూ చేరువకానుంది.వాట్సాప్‌లో మనం ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపితే దాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది కాదు. కొత్తగా తీసుకొస్తున్న ఈ ఫీచర్ ద్వారా ఆ సౌలభ్యం వినియోగదారులకు లభించనుంది. అవతలి వ్యక్తి చూడనంత వరకూ ఆ మెసేజ్‌ను తొలగించడం గానీ, ఎడిట్ చేయడం గానీ చేయొచ్చు. అవతలి వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఇది సాధ్యపడదు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa