మామునూరు 4వ బెటాలియన్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మేయర్ నరేందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. అన్ని విద్యాసంస్థల్లో ఈ నెల 15న గ్రీన్ డేగా పాటించాలని సూచించారు. గ్రీన్ డేలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa