భూపాలపల్లిలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూపాలపల్లిలోని అటవీ భూముల్లో స్పీకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళి, డీఎఫ్‌వో రవికిరణ్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ సంపూర్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. హరిత తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఆకుపచ్చ తెలంగాణను తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అధికంగా మొక్కలు నాటి అటవీ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa