ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం దొరికింది. ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ చీఫ్ వెంకన్న నివాసంపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆయనకు సుమారు 40 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వెంకన్నకు సంబంధించిన హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట, విజయవాడల్లో ఉన్న నివాసాలపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయన నివాసాల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు కనుగొన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa