డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. హీరో రవితేజ, హీరోయిన్ ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్ లతో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు. వీరిలో గాయని గీతామాధురి భర్త నందు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో, నందుని ఓ మీడియా సంస్థ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ తనకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వాస్తవాలను మాత్రమే వెలుగులోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీడియాకు ఉందని అన్నాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa