ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియాలో వస్తున్న పేర్లకు సంబంధం లేదు: అకున్ సబర్వాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 12:46 PM

డ్రగ్స్ కేసులో సిట్ పోలీసుల నుంచి టాలీవుడ్ నటీమణులు చార్మీ, ముమైత్ ఖాన్ లు నోటీసులు అందుకున్నారని వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్‌ సబర్వాల్‌ నిరాకరించారు. వారి గురించి తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేసిన ఆయన, ఇప్పటివరకూ 8 మందికి మాత్రమే నోటీసులు వెళ్లాయని, మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము ఎవరి పేర్లను బహిర్గతం చేయలేదని, మీడియాలో వస్తున్న పేర్లకు, తమకు సంబంధం లేదని అన్నారు. తామిచ్చిన నోటీసుల్లోనే వారు ఏ తేదీన, ఏ సమయంలో హాజరు కావాలన్న విషయమై స్పష్టంగా చెప్పామని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa