హైదరాబాద్ : రైతుల సమస్యలను గవర్నర్ నరసింహన్‌కు వివరించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రుణమాఫీ 4 విడతల వల్ల రైతుకు లాభం జరగలేదన్నారు. వడ్డీభావరం ప్రభుత్వమే భరిస్తుందని 6నెలల క్రితం సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఏం చేయాలని బ్యాంకులు అంటున్నారన్నారు.