హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయాలను విద్యకు, పరిశోధనకు నిలయాలుగా తీర్చిదిద్దాలి అని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. విశ్వవిద్యాలయాల్లో సభలు, సమావేశాలు, రాజకీయాలకు తావివ్వొద్దన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్ లకు చోటు ఉండొద్దు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతటా సీసీ కెమెరాలు పెట్టాలి. మన యూనివర్శిటీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడున్న వీసీలు, రిజిస్ట్రార్లదే అని కడియం స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, రిజిస్ట్రార్లతో మంత్రి కడియం శ్రీహరి ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళికపై నాంపల్లిలోని రూసా బిల్డింగ్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు.