ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 11:19 AM
 

హైదరాబాద్: శాసనసభ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కోమటిరెడ్డి, గీతారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనసభ్యులు ఒక్కొక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యేల సెల్‌ఫోన్‌లు, పెన్నులను అధికారులు పోలింగ్ బుత్‌లోకి తనుమతించడం లేదు. అంతకు ముందు టీఆర్‌ఎస్ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి శాసనసభ్యులు, మంత్రులు మూడు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.