ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగ నియామకాలపై చర్చకు సిద్ధమా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 05:03 PM

ఉద్యోగుల నియామకాలపై కాంగ్రెస్ నేతలతో, ప్రొఫెసర్ కోదండరాంతో చర్చకు సిద్ధమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రకటించినట్టు లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. టీజేఏసీగా కాకుండా కేజేఏసీగా కోదండరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. నీళ్లు, నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని వేణుగోపాలచారి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ఇతర రాష్ట్రాలు సైతం అమలు చేసేందుకు ముందుకొచ్చాయని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంటే.. విపక్షాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయని వేణుగోపాలచారి మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ప్రజలను  తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa