ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంబులెన్సులో బయల్దేరనున్న ఎమ్మెల్యే!

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 12:02 PM
 

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈరోజు జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి ఆయన ఆసుపత్రి నుంచి అసెంబ్లీకి అంబులెన్సులో బయల్దేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పని సరిగా ఓటు వేయాలని నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఓటు వేయాల్సిందేనని అవసరమైతే వారిని అంబులెన్సులో తరలించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, మనోహర్ రెడ్డి అంబులెన్సులో బయల్దేరడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు, మనోహర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న ప్రత్యేక పూజలు చేశారు.