మహిళా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల నియామక పరీక్షపై స్టే

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:01 PM
 

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో లెక్చరర్ల నియామక పరీక్షపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా మహిళలనే నియమించాలన్న నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.