చైనాలో వ‌ర‌ద‌లు 18 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:05 PM
 

జిలిన్: చైనాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. జిలిన్ ప్రావిన్సులో భీక‌ర‌మైన వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 18 మంది మృతిచెందారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వ‌ర్షాల వ‌ల్ల జిలిన్ రాష్ట్రంలో మ‌ధ్య‌, తూర్పు ప్రాంతాలు మొత్తం జ‌ల‌మ‌యం అయ్యాయి. జిలిన్ న‌గ‌రంలో కూడా భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. సుమారు ల‌క్ష మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. బుర‌ద‌ను తొలిగించేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. భారీ ఎత్తున రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది.