తన బయోపిక్ లో నటించనున్న పీవీ సింధు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:23 PM
 

ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు తన బయోపిక్ లో నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, ఆ చిత్ర నిర్మాత సోనూసూద్ ధ్రువీకరించాడు. ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన సోనూసూద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రధాన పాత్రను దీపికా పదుకోనే పోషించనున్నట్టు వస్తున్న వార్తలపై ప్రశ్నించగా... నటీనటులను ఇంతవరకు ఎంపిక చేయలేదని చెప్పాడు. అయితే, ఈ సినిమాలో దీపిక కూడా భాగస్వామి అవుతుందని తెలిపాడు. స్క్రిప్ట్ తుది దశలో ఉందని చెప్పాడు. తాను కూడా ఈ సినిమాలో ఓ పాత్రను పోషిస్తున్నట్టు చెప్పాడు.