పార్లమెంట్ లో సమస్యలపై గళమెత్తుతాం: ఎంపీ వినోద్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 03:01 PM
 

ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌. పార్లమెంట్‌లో ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం ఓటు హక్కు వినియోగించుకున్నామని వినోద్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ముఖ్యంగా హైకోర్టు విభజన, రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు‌.