పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కు జరిమానా!

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 05:01 PM
 

కెనెడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కు లాస్ ఏంజెలెస్ పోలీసులు జరిమానా విధించారు. శనివారం తన మెర్సిడెస్ జీ-వేగన్ కారులో వెళ్తూ ఆయన ఫోన్ లో మాట్లాడుతుండటం పోలీసుల కంటపడింది. దీంతో, బీబర్ కారును ఆపిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు 162 డాలర్ల జరిమానా విధించారు. బీబర్ కూడా పోలీసులతో ఎలాంటి వాగ్వాదానికి దిగకుండా, మర్యాద పూర్వకంగా జరిమానా కట్టి, అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బీబర్ వరల్డ్ టూర్ లో ఉన్నాడు. గత మే నెలలో ఆయన భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.