పోలీస్ అధికారులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 05:58 PM
 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. యశోద హాస్పిటల్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు కొనసాగనున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ కోటిరెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరంలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేశారు. డాక్టర్లు ఇవాళ మొత్తం 600 మంది పోలీస్ అధికారుల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్ వారు అందించే హెల్త్ క్యాంపులు అభినందనీయమన్నారు.