న్యూఢిల్లీ : విపక్షాల ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు గాంధీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గోపాలకృష్ణ గాంధీ కంటే ముందే ఎన్డీఏ ఉపరాష్ర్టపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే.