ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2017, 08:39 AM

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగాపలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తర్వాత నాలుగైదు రోజుల వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో సాధారణం కంటే 20 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది.


             మంగళవారం సాయంత్రం వరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్లూరు, సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి, మేడ్చల్‌ఉమల్కాజిగిరి జిల్లా డీపీ పల్లిల్లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల దాకా తగ్గాయి. గత 24 గంటల్లో భద్రాచలం, హకీంపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్‌ల్లో 26 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీలు నమోదైంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com