హైదరాబాద్ నగరంలో వర్షాల నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్లతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించారు. నగరంలో రోడ్లపై పడ్డ గుంతలను తక్షణమే పూడ్చివేసి మరమ్మతులు చేయాలని ఇంజినీర్లను కమిషనర్ ఆదేశించారు. రోడ్ల నిర్వహణపై యూనిట్ రేట్లను నిర్ణయించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ విధానం వల్ల టెండర్లు పిలిచే అవసరం ఉండదన్నారు కమిషనర్. రద్దీ ప్రాంతాల్లో పునరుద్ధరణ తక్షణమే చేపట్టి.. రాత్రివేళల్లో శాశ్వత పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa