న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరో రెండు పాన్లతో ముందుకొస్తోంది. ఇటీవల రిలయన్స్ జియో ప్రకటించిన టారిఫ్‌లకు చాలా దగ్గరగా ఉండేలా, ఒకరకంగా చెప్పాలంటే అంతకంటే చవక ప్లాన్లను ప్రకటించింది. రూ.145కే 14 జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ ఉచిత కాలింగ్ సదుపాయంతోపాటు 14 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే రూ.349 రీచార్జ్‌తో అన్ని నెటవర్క్‌లకు అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్‌తోపాటు 14 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. కాగా వచ్చేనెల 31తో జియో ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్‌షిప్ స్కీంతోపాటు కొత్తగా టారిఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం తొలుత రూ.99 చెల్లించాలి. తర్వాత జియో ఉచిత ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకు రూ.303 చెల్లించాల్సిందే. ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాదిపాటు అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa