హైదరాబాద్: ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఈరోజు ఐదో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేశ్ తన గారాలపట్టికి సోషల్మీడియా ద్వారా విషెష్ చెప్పారు. ‘తనతో రోజూ నాకు ప్రత్యేకమే. ఈరోజు తనకి ప్రత్యేకం. నాచిట్టి తల్లి ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా కూతురు ఈరోజు ఐదో పుట్టినరోజు జరుపుకొంటోంది’ అని ట్వీట్ చేస్తూ కూతురితో దిగిన ఫొటోను షేర్ చేశారు.
మరోపక్క మహేశ్ సతీమణి నమ్రత తన గారాలపట్టి సితార పుట్టినరోజు గురించి రెండు రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సితారపట్టు పరికిణీలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘5 సంవత్సరాల వైపు ఆమె (సితార)’ అని రాశారు. సితార పుట్టినరోజు సందర్భంగా ఆమె చేతికి గోరింటాకు పెట్టుకుని తన సోదరితో దిగిన ఫొటోను నమ్రత తాజాగా అభిమానులతో షేర్ చేశారు.
ప్రస్తుతం మహేశ్ ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఏ.ఆర్ మురుగదాస్దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో సితార సెట్లో సందడి చేసిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.