ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: సూపర్ స్టార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 12:46 PM

ఇవాళ మహేశ్‌బాబు గారాల తనయ సితార పుట్టినరోజు. సినిమాలపై డెడికేషన్ తో పని చేసే మన స్టార్ హీరోలు, ఫ్యామిలీకి ఇచ్చే ప్రయారిటీ కూడా ముచ్చటగొలుపుతుంది. గ్యాప్ ఇచ్చి విదేశాలకు టూర్ లకు వెళ్లటం, అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం, ఆ హ్యాపీ మూమెంట్స్ ను చూసి ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతుండటం చూస్తున్నాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఉంటాడు. ఈ సందర్భంగా తన ముద్దుల కూతురికి ట్విట్టర్‌లో మహేశ్‌ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ చెప్పారు. 'తను నా ప్రతిరోజును స్పెషల్‌గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి. నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఎంత సూపర్ స్టార్ అయినా పిల్లలపై ప్రేమ కుమ్మరించాల్సిందేగా అందుకే కూతురితో హ్యాపీగా ఉన్న గడుపుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశారు. సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు తాజా చిత్రం 'స్పైడర్‌' టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని చెబుతున్నప్పటికీ, అఫీషియల్ గా మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. మురగదాస్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పైడర్‌' సినిమా వచ్చే సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com