హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడ పరిధి హైలమ్‌కాలనీలో తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల అభ్యంతరం తెలిపినా సెల్లార్ పనులను ఇంటి యజమాని ప్రారంభించాడు. సెల్లార్ గుంత తవ్వడంతో పక్కన ఉన్న ఇల్లు గోడ కూలింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు సెల్లార్ తవ్విన ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa