హైదరాబాద్ రేపు ఉదయం పదిన్నర నుంచి నటుడు తరుణ్ విచారణ ఉంటుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇవాళ జరిగిన సిట్ విచారణలో నటుడు సుబ్బరాజు అన్ని విధాలా సహకరించారన్నారు. ముమైత్ ఖాన్ ను ఈ నెల 27 న విచారణ కు పిలిచామని... తాను హాజరవుతానని ముమైత్ ఖాన్ చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. రేపు పబ్ లు, బార్ల యజమానులతో సమావేశమవుతామని ఆయన అన్నారు. కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa