ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు కోసం సర్కారు యత్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 07:03 PM

భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు యునెస్కో గుర్తింపు కోసం సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.  పురాతన కట్టడాలైన చార్మినార్, గొల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్‌ల చుట్టుపక్కల ఆక్రమణలు, అక్రమ భవన నిర్మాణాలను తొలగించి చారిత్రక కట్టడాల ప్రాభవాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.  దీనిలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీ రామారావు, అగాఖాన్ ట్రస్టు, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, మున్సిపల్, సాంస్కృతిక శాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  చారిత్రక ప్రదేశాల అభివృద్ధి కోసం మాజీ ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa