ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ‌రంగ‌ల్ లో భాజ‌పా కార్య‌వ‌ర్గ స‌మావేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 01:18 PM

వ‌రంగ‌ల్ : భాజ‌పా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్ లో ప్రారంభ‌మ‌య్యాయి. నేటి నుంచి రెండు రోజుల  పాటు జరగనున్న ఈ సమావేశాలను...పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తోపాటు....పార్టీ నేతలు...వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, పార్టీ పటిష్టత, కేంద్ర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు...రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా ఎండగట్టడానికి అవసరమైన కార్యాచ‌ర‌ణ, వ్యూహాలకు సమావేశాల్లో రూపకల్పన చేయనున్నారు. కార్యవర్గ సమావేశాలకు జిల్లా స్ధాయి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమావేశం జరిగే ప్రాంగణం సమీపంలోనూ.. రహదారికిరువైపులా...పార్టీ జెండాలతో కళ సంతరించుకుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa