-త్వరలో అన్ని కార్పోరేషన్ల ఛైర్మన్‌లను ప్రకటించనున్న సర్కార్
-ఆరు పదవులు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
-జిల్లా స్థాయిలోని పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటున్న మంు్తల్రు
-ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమవుతున్న సచివులు
-వారం రోజులలో పదవుల భర్తీ పూర్తవుతుందంటున్న సిఎం సన్నిహిత వర్గాలు
- హైదరాబాద్‌కు పయనమైన ఆశావాహులు, అగ్రనేతలతో మంతనాలు
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధిః టిఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పంపిణీకి రంగం సిద్దమైందని సమా చారం. ఇప్పటికి పలు కార్పోరేషన్‌లకు ఛైర్మన్‌లను ప్రకటించిన సర్కార్ తాజా గా మరో పది రాష్ట్ర స్థాయి కార్పోరేషన్‌ల పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేశారని సమాచారం. ఈ మేరకు సిఎం కెసిఆర్ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. రాష్ట్రంలోని పది యూనివర్శిటిలకు విసిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో సామాజికి న్యాయానికే సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలకంగా పాల్గొన్న పలువురు ప్రొఫెసర్లకు పదవులు వరించాయి. సీనియర్ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల పంపిణీలో ప్రాధాన్యత ఇస్తామని సిఎం కెసిఆర్ ముందు నుండి చెబుతున్నట్టుగానే ఈ సారి భర్తీ చేయబోయే కార్పోరే షన్లలో ఆరు ఛైర్మన్ పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హరం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గులాబీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విడతలో భర్తీ చేయబోయే నాలుగు కార్పోరేషన్లలో ఒకటి విద్యార్థి సంఘానికి చెందిన నేతకు ఇచ్చేందుకు సిద్దమవుతుండగా మరో మూడు రాష్ట్ర పార్టీ నేతలను వరించే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా నామినేటెడ్ పదవుల పంపిణీకి సంబందించి సిఎం కెసిఆర్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారితో పాటు ప్రజా బలం ఉండి ఇటీవలే పార్టీలో చేరిన నేతలకు కూడ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. టిఆర్‌ఎస్ సర్కార్ కొలువుదీరి రెండు సంవత్సరాలు పూర్తయి మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రజలలోకి తీసుకెళ్లగ లిగే నాయకులకే పెద్దపీట వేస్తారని సమాచారం.
పది కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీకి రంగం సిద్దం
రాష్ట్రంలోని పది కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టిఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మిషన్ భగీరథ, టిఎస్‌ఆర్‌టిసి, ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ లాంటి కీలక పదవులన్ని ఇప్పటికే భర్తీ చేశారు. వాస్తవానికి ఈ పదవులన్నింటిని మూడు నెలల క్రితమే భర్తీ చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినప్పటికి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తరు వాత కూడ పదవుల పంపిణీని పూర్తి చేయకుంటే పార్టీ శ్రేణులలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే వీలయి నంత త్వరగా పదవులను భర్తీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. ఇందు లో నాలుగు పదవులు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలకు వచ్చే అవకాశాలు ఉన్నా యి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్లు ఖరారయ్యాయి. వీరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన వాటిలో పార్టీ సీనియర్ నేతల పేర్లను సిఎం కెసిఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం.
జిల్లా స్థాయి పదవుల భర్తీ కోసం ఎమ్మెల్యేలతో మంత్రుల మంతనాలు
తెలంగాణలోని ఆయా జిల్లాలో మార్కెట్ పాలక వర్గాలను సర్కార్ ప్రకటించింది. గతంలో ఎన్నడు లేని విదంగా ఛైర్మన్ పదవులలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది. దేవాలయ కమిటీలతో పాటు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, పట్టణాభివృద్ది సంస్థలు, వాటి డైరక్టర్లు, స్టేట్ కార్పోరేషన్ డైరక్టర్ల వంటి పదవులను ఈ దఫాలో భర్తీ చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇవన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల వరకు ఉంటాయని టిఆర్‌ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏరపిడిన తరువాత మొదటి సారిగా పదవుల భ ర్తీ చేపట్టుతుండడంతో మొదటి నుండి టిఆర్‌ఎస్‌లో కష్టపడుతున్న వారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఉంది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. వారందరికి పదవుల ఆశ చూపారని అటువంటి వారిని కూడ సంతృప్తి పరిచే విదంగా చ
ర్యలు తీసుకోనున్నామని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి వెల్లడించారు. అంటే పాత కొత్త వారి కలయికతో ఈ సారి నామినేటెడ్ జాతర జరుగుతుందని టిఆర్‌ఎస్ వర్గాలే పేర్కొంటున్నాయి.
సామాజిక న్యాయం కోసం కెసిఆర్ ప్రయత్నాలు
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని యూనివర్శిటిలకు వైస్ ఛాన్సలర్లు లేకుండా పోయారు. దీంతో యూనివర్శిటిలలో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. అసెంబ్లీలో కూడ దీనికి సంబందించిన చర్చ జరిగింది. దీంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పది యూనివర్శిటిలకు సీనియర్ ప్రొఫె సర్లను వీసిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక న్యాయానికే సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారు. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. వరంగల్ వంటి చోట్ల మాత్రం పార్టీ నేతల మద్య ఉన్న విభేదాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పందేరం మొదలు కాలేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఈ పదవుల పంపకాలలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది. ఎస్‌సి, ఎస్టీలకు గతంలో ఎన్నడు లేని విదంగా ఈ సారి అవకాశాలు పెరిగాయి. విసిల నియామాకంలోను సామాజిక న్యాయానికే సిఎం కెసిఆర్ పెద్దపేట వేశారు. పది కార్పోరేషన్ ఛైర్మన్ పదువుల ఖరారుకు సంబందించిన వార్తలు రావడంతో పార్టీలోని ఆశావాహులంతా హైదరాబాద్ పయణమయ్యారు. తమ అధినేత కెసిఆర్ తో పాటు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితులలోను అమ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa