డ్రగ్స్ వ్యవహారంలో సెలబ్రిటీలను సిట్ విచారిస్తున్న విధానంపై సోషల్ మీడియా వేదికగా ఎక్సైజ్ శాఖపై తాను చేసిన కామెంట్లు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌కు, ఎక్సైజ్ శాఖకు క్షమాపణలు తెలియజేశారు. అకున్ సభర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిగా మీడియా చిత్రీకరిస్తుందని చెబుతూ, దర్శకుడు రాజమౌళి అకున్ హీరోగా బాహుబలి 3 సినిమా తీయాలని ఫేస్‌బుక్‌లో రామ్‌గోపాల్ వర్మ పోస్ట్ చేశారు.దీనిపై ఎక్సైజ్ కమిషనర్ ఆర్.చంద్రవదన్ స్పందించి, డ్రగ్స్ గుట్టు బయటపెట్టడానికి తమ వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను కించపరుస్తున్నారని అన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ `పోలీసు శాఖ పనితనాన్ని నేను చిన్నబుచ్చలేదు. కేవలం సినిమా పరిశ్రమ, సెలబ్రిటీలను కొంచెం గౌరవించండి అని మాత్రమే తెలియజేయాలనుకున్నా` అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa