డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలపాటు సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు తెలుస్తుంది. పలు కోణాలలో సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు విచారించిన వారి కన్నా చిన్నా విచారణనే అధికారులు చాలా తొందరగా ముగించారని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటల కు ఎక్సైజ్ కార్యాలయంలో చిన్నా విచారణ ప్రారంభం అయిన సంగతి తెలిపిందు. నిన్న నటుడు నవదీప్ ను సిట్ అధికారులు రాత్రి 9.45 వరకు విచారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa