రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను రెండంచెల వ్యవస్థలోకి తీసుకురావచ్చునని సురేశ్‌చందా కమిటీ తెలిపింది. వివిధ శాఖలలో ఉన్న 762 రకాల పోస్టులను రాష్ట్ర, జిల్లాలు అనే రెండు స్థాయిల్లో చేర్చాలని, ఇప్పుడు జోనల్‌స్థాయిలో ఉన్న అధికశాతం పోస్టులను రాష్ట్రస్థాయికి మార్చాలని సూచించింది. రాష్ట్రస్థాయిలో మెజార్టీ పోస్టుల భర్తీ పదోన్నతుల ద్వారానే జరుగాలని పేర్కొన్నది. జోనల్ వ్యవస్థను రద్దుచేస్తే దాని స్థానంలో ఏర్పాటుచేసే వ్యవస్థ ఏవిధంగా ఉండాలన్న విషయమై అధ్యయనానికి ప్రభుత్వం సురేశ్‌చందా చైర్మన్‌గా కమిటీని నియమించింది. ఈ ఏడాది జూన్ 29న ఏర్పాటైన ఈ కమిటీలో రాజేశ్వర్‌తివారి, అధర్‌సిన్హా, ఎన్ శివశంకర్‌తోపాటు లా కార్యదర్శి సభ్యులుగా, డిప్యూటీ సెక్రటరీ అప్పారావు కన్వీనర్‌గా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa