హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తులో మరో ముందడుగు. ఈ కేసులో మరో కీలక నిందితుడిని ఎక్సైజ్‌శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు వెల్లడించారు. 33 ఏళ్ల మైక్ కమింగ నాలుగుసార్లు భారత్‌కు వచ్చాడని, అతని వద్ద భారతీయ పాస్‌పోర్టు ఉందని, దాని గడువు ముగిసినా ఇంకా భారత్‌లోనే అతను ఉన్నాడని చెప్పారు. మైక్ కమింగను కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. సినీ ప్రముఖులతో కమింగకు పరిచయాలు ఉన్నాయని తెలిపారు. మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడంలో కమింగాది కీలక పాత్ర అని తెలుస్తోంది. పలు సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులకు కమింగా డ్రగ్స్ అందిస్తున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమ మొదలు పాఠశాలల వరకు విస్తరించిన డ్రగ్స్ మహామ్మారిని మూలాల్లోంచి పెకలించేందుకు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నకొద్దీ మరిన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతకొన్ని రోజులుగా డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా హీరోయిన్ చార్మీని సిట్ బుధవారం ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa