డ్రగ్స్ వ్యవహారంలో మాస్ మహరాజా రవితేజ రేపు సిట్ విచారణను ఎదుర్కోనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రముఖ న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నాడు. సిట్ విచారణ ఎలా ఉండబోతోంది, విచారణను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమాధానాలు చెప్పాలనే కోణంలో లాయర్ సలహాలను ఆయన తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు, రేపటి విచారణకు ఆయన తన నివాసం నుంచి కాకుండా, మరో ప్రాంతం నుంచి సిట్ కార్యాలయానికి రానున్నట్టు తెలుస్తోంది. మీడియా తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. డగ్స్ వ్యవహారంలో తన పేరు వచ్చిన తర్వాత ఇంతవరకు రవితేజ స్పందించలేదు. ఆయన తల్లి మాత్రం ఈ అంశంపై స్పందించారు. తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు లేదని... అతని పేరు ఇందులో ఉండటం తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa