ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామేశ్వరం- ఫైజాబాద్‌ రైలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 03:04 PM

చెన్నై: తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌( వయా అయోధ్య) వరకు నడిచే వారపు ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘రామేశ్వరంలోని పవిత్రమైన మట్టిని తాకినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ పవిత్ర భూమి భారతీయ ప్రముఖుల్లో ఒకరైన డా.ఏపీజే అబ్దుల్‌ కలాంను దేశానికి ఇచ్చింది’ అని కొనియాడారు. ‘కలాం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుత యువత ఉద్యోగ రూపకర్తలుగా మారాలని అనుకుంటున్నారు’ అని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం స్మారక మండపాన్ని నిర్మించేందుకు ఎంతో కృషి చేసిన కార్మికులకు అందరూ లేచి నిలబడి కృతజ్ఞతలు తెలియజేయాలని సభకు విచ్చేసిన వారిని కోరారు. ‘ఇటువంటి సమయంలో జయలలితను ఎంతో మిస్‌ అవుతున్నాం. కానీ ఆమె దీవెనలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ఆమె ఇక్కడ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. ఆమె ఓ గొప్ప నేత.. ప్రతి ఒక్కరూ అమ్మను స్మరించుకోవాలి’ అని మోదీ అన్నారు. రామేశ్వరం-ఫైజాబాద్‌(వయా ఆయోధ్య) రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలు(నెం.16793/16794) ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్‌ స్టేషన్లలో ఆగనుంది. రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి పైజాబాద్‌లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa