ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2017, 03:32 PM

సీఎం కేసీయార్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా  ముగిసింది.  చివరిరోజు పర్యటనలో భాగాంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా రాష్ర్టపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తో.. టీఆర్ఎస్ ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రగతి, అభివృద్ధి ని  సీఎం కేసీయార్‌.. రాష్ర్టపతి కి వివరించారు. దేశంలోనే రాష్ర్ట జీడీపీ 21.5 శాతంతో ముందు వరుసలో ఉందని తెలిపారు. 10.2 శాతంతో ఛత్తీస్ గఢ్ రెండో స్థానంలో ఉందని చెప్పారు.  భూగర్భ జలాలు పెరిగేలా మిషన్ కాకతీయ, ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకాల గురించి సమావేశంలో చర్చించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa