హైదరాబాద్ : సరూర్నగర్లో బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5 వేల మందికిపైగా మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని ఆలయాలకు ఊరేగింపుగా తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో ‘బోనం-తెలంగాణ ప్రాణం’ పేరుతో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెహ్రూ యువకేంద్ర సంఘటన్-తెలంగాణ కళల వేదిక ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.